Sunday, 25 January 2026 06:24:13 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్

Date : 22 May 2025 11:50 AM Views : 329

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనలోని మానవత్వాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్న ఆయన తన 65వ పుట్టినరోజును జరుపుకున్నారు. 1960 మే 21న జన్మించిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుమారు 400 చిత్రాల్లో నటించి, ఇప్పటికీ కథానాయకుడిగా చురుగ్గా సినిమాలు చేస్తూ, ఇతర భాషా చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మోహన్ లాల్ రెండు కీలకమైన సేవా కార్యక్రమాలను ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. కేరళలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. "చాలా మంది చిన్నారులు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వారిలో అనేకమందికి ఈ ఆపరేషన్ అత్యవసరం. అలాంటి వారందరికీ తన ఫౌండేషన్ అండగా నిలుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు, 'బి ఎ హీరో' అనే పేరుతో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఒక విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మోహన్ లాల్ తెలిపారు. యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోహన్ లాల్ 2015లో తన తల్లిదండ్రుల పేరిట విశ్వశాంతి ఫౌండేషన్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :