Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బీహార్ రాజధాని పాట్నాలో రెండ్రోజుల క్రితం జరిగిని పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లక్షలాదిమంది ప్రజలు ఈవెంట్‌కు రావడంతో ఇప్పుడు బాలీవుడ్‌కు ‘పుష్ప’ భయం పట్టుకుంది. పుష్ప-2 ఓపెనింగ్స్‌పై ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 సినిమా నార్త్‌లో రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి తెలుగు మూవీగా రికార్డులకెక్కింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌ఖాన్ జవాన్ సినిమా ఉత్తరాదిలో రూ. 65 కోట్ల ఓపెనింగ్స్‌తో అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు సొంతం చేసుకుంది. అయితే, పాట్నాలో పుష్ప- 2 ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసిన వారు షారూఖ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే బాలీవుడ్ నటులకు కంటి మీద కునుకు ఉండదని అంటున్నారు. ఒకవేళ అంచనా వేస్తున్నట్టుగానే షారూఖ్ జవాన్ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ రికార్డును పుష్ప-2 బద్దలుగొడితే ఆ తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేయడం ఇప్పట్లో బాలీవుడ్ తరం కాకపోవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. అంతేకాదు, అనుకున్నట్టే పుష్ప-2 విజయం సాధిస్తే భారతీయ సినిమాపై టాలీవుడ్ పట్టు సాధిస్తుందని కూడా చెబుతున్నారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్ విచారణ?
Admin
Studio18 News