Thursday, 12 March 2026 12:15:21 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Riya Singha: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Date : 10 December 2025 06:35 PM Views : 128

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా సత్య హీరోగా నటిస్తున్న 'జెట్లీ' చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం యాక్షన్ ప్రాధాన్యమున్న శివానీ రాయ్ పాత్రలో రియా అందాల పోటీల్లో సత్తా చాటిన మరో భామ వెండితెరపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మిస్ యూనివర్స్ ఇండియా-2024 విజేత రియా సింఘా నటిగా తన ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే ప్రారంభించడం విశేషం. కమెడియన్ సత్య హీరోగా, ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేశ్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జెట్లీ’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రియా సింఘా ఇంటెన్స్ లుక్‌తో, యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘శివానీ రాయ్’ అనే పాత్రను పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పోస్టర్‌ను బట్టి చూస్తే, ఆమె పాత్రకు సినిమాలో యాక్షన్‌కు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన రియా సింఘా, 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా-2024 కిరీటాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అంతకుముందు ఏడాది ‘మిస్ టీన్ గుజరాత్’, ‘మిస్ టీన్ ఎర్త్’ టైటిల్స్‌ను కూడా సొంతం చేసుకున్నారు. మిస్ టీన్ గుజరాత్ గెలిచిన తొలి గుజరాతీ అమ్మాయిగా ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ‘మిస్ యూనివర్స్-2024’ పోటీల్లో టాప్ 30లో నిలిచారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రియా, పాఠశాల రోజుల నుంచే మోడలింగ్‌లో రాణిస్తున్నారు. ఆమె ఒక టెడెక్స్ స్పీకర్ కూడా. పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌లో ఆమె డిగ్రీ పూర్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :