Sunday, 25 January 2026 04:47:34 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Anushka Shetty: 'ఘాటి' ఘాటు .. అనుష్క ఫ్యాన్స్ వెయిటింగ్!

Date : 30 August 2025 06:57 PM Views : 327

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అనుష్క ప్రధాన పాత్రధారిగా 'ఘాటి' హైలైట్ గా నిలవనున్న ఆమె యాక్షన్ సీన్స్ ఆమె కెరియర్ లో నిలిచిపోయే సినిమా అంటున్న క్రిష్ ప్రధానమైన పాత్రల్లో బలమైన తారాగణం సెప్టెంబర్ 5వ తేదీన ఐదు భాషల్లో విడుదల తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అందానికి అసలైన కొలమానం అనుష్క అని ఆమె ఫ్యాన్స్ అంటారు. ఆకర్షణకి నిజమైన నిదర్శనం కూడా ఆమెనే అని బలంగా చెబుతారు. అయితే అనుష్క అభిమానులలో సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇతర భాషలకు చెందిన హీరోలు .. హీరోయిన్స్ కూడా ఉండటం విశేషం. నిజంగానే జానపద .. పౌరాణికాలకు సైతం సరిగ్గా సరిపోయే చక్కని కనుముక్కు తీరు అనుష్క సొంతం అనేది ఎవరూ కాదనలేని మాట. అనుష్క సినిమాల సంఖ్య తగ్గించి చాలా కాలమైంది. నాయిక ప్రధానమైన కథల వైపే ఆమె ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అలా ఆమె అంగీకరించిన సినిమానే 'ఘాటి'. యూవీ - ఫస్టు ఫ్రేమ్ బ్యానర్లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్, ఒక్కసారిగా అంచనాలు పెరిగేలా చేసింది. గంజాయి మోసే కూలీగా ఈ సినిమాలో అనుష్క కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. విక్రమ్ ప్రభు .. రమ్యకృష్ణ .. జిషు సేన్ గుప్తా కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుష్క భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నట్టుగా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఆమెకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. తమకి ఆధారమైన కొండ ప్రాంతంపై కొన్ని స్వార్థ శక్తులు పట్టు బిగించడానికి ప్రయత్నిస్తే, వాళ్లతో పోరాటానికి దిగే పాత్రలో అనుష్క కనిపించనుంది. రెండేళ్ల తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమా పట్ల ఆసక్తితో ఉన్నారు. 5 భాషల్లో సెప్టెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనేది చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :