Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chalaki Chanti : ఎప్పట్నుంచో సినీ పరిశ్రమలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన చంటి జబర్దస్త్ తో చలాకి చంటిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో పేరొచ్చాక పలు టీవీ షోలు, సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. అయితే గత సంవత్సరం చంటికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరాడు. అలాగే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంటి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా చాన్నాళ్ల తర్వాత బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు మాట్లాడాడు చంటి. చంటికి కోపం, ఈగో ఎక్కువ అని గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. వాటి పై కూడా చంటి స్పందించాడు. చంటి మాట్లాడుతూ.. నాకు ఈగో ఉందని, షూటింగ్ కి వస్తే కొన్ని అడుగుతానని కొంతమంది నన్ను నెగిటివ్ గా ప్రచారం చేసి, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికించి, నాకు రావాల్సిన మంచిని ఆపేసి, నాకు రావాల్సిన ఛాన్సులు రాకుండా చేసారు. అలా చేసిన వాళ్ళు సర్వ నాశనం అయిపోతారు. నేను బతికుండగానే వాళ్ళు నాశనం అవ్వాలి. అది చూసే నేను చచ్చిపోవాలి. వాళ్ళు ఆలా సర్వ నాశనం అయిపోవాలని రోజు దేవుడిని కూడా కోరుకుంటున్నాను అని అన్నారు. అలాగే.. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ని పేరు పెట్టి పిలిచినందుకు ఆ చుట్టు పక్కన వాళ్ళు నెగిటివ్ చేసి సినిమాలో నా క్యారెక్టర్ తీయించేసారు. మనకు ఏదైనా ఛాన్స్ వస్తే చంటి అలా అంట, చంటి ఇలా అంట అని నెగిటివ్ గా చెప్పి ఆ అవకాశాన్ని పోగొట్టేవాళ్ళు. ఇలా చాలా అవకాశాలు పోయాయి. అలా నామీద నెగిటివ్ గా ప్రచారం చేసి నా అవకాశాలు, నాకు రావాల్సినవి కూడా రాకుండా చేసిన వాళ్ళు సర్వ నాశనం అయిపోవాలి అంటూ సంచలన కామెంట్స్ చేసారు.
Admin
Studio18 News