Monday, 19 January 2026 07:12:54 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Nandamuri Balakrishna: వైజాగ్‌లో 'అఖండ 2' సందడి.. 'జాజికాయ' పాట విడుదల

Date : 19 November 2025 07:54 PM Views : 186

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : డిసెంబర్ 5న రానున్న బాలకృష్ణ అఖండ 2: తాండవం జాజికాయ ఐటెం సాంగ్ కాదు, కుటుంబ వేడుకలోని పాటన్న బోయపాటి సనాతన ధర్మం శక్తిని ఈ చిత్రంలో చూస్తారన్న బాలయ్య నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిన్న వైజాగ్‌లో చిత్రంలోని "జాజికాయ జాజికాయ" అనే పాటను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సంయుక్తా మేనన్ నటిస్తుండగా, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "నాది, బోయపాటిది సినిమా వస్తుందంటేనే ఇంట గెలిచినట్లు. ఇప్పుడు 'అఖండ 2'తో రచ్చ గెలవడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ‘అఖండ తాండవం’ పాటతో హిందీ ప్రేక్షకులకు మా తొలి దెబ్బ రుచి చూపించాం. ఇప్పుడు విడుదల చేసిన 'జాజికాయ' పాట ఐటెం సాంగ్ కాదు, కుటుంబ పండగలో వచ్చే గీతం," అని స్పష్టం చేశారు. "సనాతన హిందూ ధర్మం మన జాతి మూలం. ఆ ధర్మం చెప్పే శక్తిని, పరాక్రమాన్ని, గౌరవాన్ని ఈ సినిమాలో చూస్తారు," అని బాలకృష్ణ ఉద్ఘాటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో ఉన్న ఏకైక మాస్ పాట 'జాజికాయ'. ఇది పుట్టినరోజు వేడుక నేపథ్యంలో వస్తుంది. ఈ పాటలో బాలకృష్ణను మరో కోణంలో చూస్తారు," అని తెలిపారు. కథానాయిక సంయుక్తా మేనన్ మాట్లాడుతూ.. బాలయ్య-బోయపాటి కలయిక అనగానే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకున్నానని, తన పాత్రలో కొన్ని సస్పెన్స్ అంశాలు ఉంటాయని అన్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :