Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ కూడా చేసారు. అయితే తాజాగా రష్మిక మందన్నని ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్(I4C)కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. కొన్నాళ్ల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది సైబర్ క్రైమ్. అది జరిగిన తర్వాత నేను సైబర్ క్రైమ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలి అనుకున్నాను. అందరికి దీనిపై అవగాహన కలిగించాలి అనుకున్నాను. ఈ క్రమంలో భారత ప్రభుత్వంతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను అని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సైబర్ క్రిమినల్స్ అందర్నీ టార్గెట్ చేస్తూ ఉంటారు. మనం అలర్ట్ గా ఉండటమే కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, అలాగే సైబర్ క్రైమ్స్ జరగకుండా పనిచేయాలి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నేను సైబర్ క్రైమ్స్ పై అవగాహన పెంచుతాను. దేశాన్ని సైబర్ క్రైమ్స్ నుంచి కాపాడాలి అని తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కి బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు పలువురు అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. తనకి జరిగింది ఇంకొకరికి జరగకుండా సైబర్ క్రైమ్స్ పై అవగాహన పెంచడానికి రష్మిక ముందుకొచ్చినందుకు ఆమెని అభినందిస్తున్నారు.
Admin
Studio18 News