Monday, 08 December 2025 02:48:00 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Ranbir Kapoor: రాముడిగా రణ్‌బీర్‌పై ట్రోల్స్.. స్పందించిన సద్గురు

Date : 30 October 2025 07:33 PM Views : 123

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నటుడి గత పాత్రలను బట్టి విమర్శించడం అన్యాయమన్న సద్గురు సినిమా పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన వివేక్ ఒబెరాయ్ రావణుడిగా నటిస్తున్న యశ్‌ను ప్రశంసించిన సద్గురు బాలీవుడ్ దర్శకుడు నితీశ్‌ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తుండటంపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ స్పందించారు. రణ్‌బీర్‌ ఎంపికను ఆయన గట్టిగా సమర్థించారు. ఈ సినిమా నిర్మాత నమిత్‌ మల్హోత్రాతో జరిగిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సద్గురు మాట్లాడారు. గతంలో రణ్‌బీర్‌ కొన్ని భిన్నమైన పాత్రలు చేశాడని, ఇప్పుడు రాముడి పాత్రకు సరిపోడంటూ ట్రోల్ చేయడం అన్యాయమని అన్నారు. ‘భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి ముందే తెలియదు కదా? రేపు మరో సినిమాలో రావణుడిగా నటించవచ్చు. అప్పుడు కూడా ఇలాగే విమర్శిస్తారా? ఇది సరైన పద్ధతి కాదు’ అని సద్గురు హితవు పలికారు. ఇదే సమయంలో రావణుడిగా నటిస్తున్న యశ్‌ అందమైన, తెలివైన వ్యక్తి అని ప్రశంసించారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. భారతీయ సినిమాకు ‘రామాయణ’ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా సన్నీ దేవోల్‌ నటిస్తున్నారు. కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :