Monday, 19 January 2026 07:21:48 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Kantha Movie: 'కాంత' చిత్రంపై ఆసక్తికర ప్రచారం.. ఎవరీ త్యాగరాజ భాగవతార్?

Date : 12 November 2025 07:22 PM Views : 230

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'కాంత' ఈ నెల‌ 14న ప్రేక్షకుల ముందుకు సినిమా తొలి ఇండియన్ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అనే ప్రచారం హత్య కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లిన నటుడి కథ విడుదలకు ముందు సినిమాపై పెరిగిన ఆసక్తి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాంత'. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల‌ 14న విడుదల కానుంది. అయితే, విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ చిత్రంపై ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. 'కాంత' సినిమా, ఒకప్పటి లెజెండరీ తమిళ నటుడు, తొలి ఇండియన్ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన ఎంకే త్యాగరాజ భాగవతార్ (MKT) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరీ త్యాగరాజ భాగవతార్? ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఆయన భారతీయ సినిమాకు తొలి సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ముఖ్యంగా 'హరిదాసు' అనే చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అపారమైన కీర్తి, సంపదతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఆయన కెరీర్, ఒక వివాదంతో తలకిందులైంది. వివాదాలు.. జైలు జీవితం ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకప్పుడు వైభవాన్ని చూసిన ఆయన, చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ కేవలం 49 ఏళ్లకే కన్నుమూశారు. ఇప్పుడు ఇదే విషాదభరిత కథను 'కాంత' పేరుతో తెరకెక్కించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్.. ఎంకే త్యాగరాజ భాగవతార్ పాత్రను పోషిస్తుండగా, ఆయన పతనానికి కారణమైన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను పెంచగా, ఈ బయోపిక్ ప్రచారంతో 'కాంత'పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :