Thursday, 12 March 2026 04:27:32 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

OG: 25 దాకా ఉంటామో పోతామో.. 'ఓజీ' హైప్‌పై సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర పోస్ట్!

Date : 20 September 2025 06:32 PM Views : 360

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈ నెల‌ 25న ప్రపంచవ్యాప్తంగా 'ఓజీ' సినిమా విడుదల పవన్ సినిమాపై హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర ట్వీట్ హైప్‌కి హెల్త్ అప్‌సెట్ అవుతోందంటూ సిద్ధు వ్యాఖ్య తెలంగాణలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ హవా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 'ఓజీ' టికెట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రేజ్ కేవలం సాధారణ ప్రేక్షకులకే పరిమితం కాలేదు, టాలీవుడ్‌లోని ఇతర హీరోలను కూడా తాకింది. తాజాగా యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ 'ఓజీ' పై చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కోసం తానెంతగా ఎదురుచూస్తున్నాడో ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. విజయదశమి కానుకగా ఈ నెల‌ 25న 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అప్పటివరకు ఆగడం కష్టంగా ఉందని సిద్ధు తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. "ఓజీ హైప్‌కి హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకూ మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత పరిస్థితి ఏంటో. పవన్ కల్యాణ్ గారు, యే పవన్ నహీ.. ఆంధీ హై" అంటూ ఆయన ట్వీట్ చేశారు. పవన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌తో ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమా కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయో అర్థమవుతోంది. మరోవైపు, తెలంగాణలో ఇప్పటికే 'ఓజీ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడైపోతుండటం సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అభిమానులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో పవన్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు భారీ స్పందనను రాబట్టుకున్నాయి. ఇక సినిమా కథాంశంపై పూర్తి స్పష్టత ఇచ్చే ట్రైలర్‌ రేపు విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :