Thursday, 12 March 2026 12:34:49 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Sandeep Vanga: 'యానిమల్‌' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ వంగా

Date : 05 February 2026 06:35 PM Views : 31

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'యానిమల్ పార్క్' టైమ్‌లైన్ ప్రకటన 2027లో ప్రారంభం కానున్న సీక్వెల్ షూటింగ్ 2028లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ 'యానిమల్' జపాన్ రిలీజ్ ప్రమోషన్స్‌లో వెల్లడి రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'యానిమల్‌ పార్క్‌' ఉంటుందని గతంలోనే ప్రకటించిన మేకర్స్, తాజాగా దానిపై ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సీక్వెల్ షూటింగ్ 2027లో మొదలుపెట్టి, 2028లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం 'యానిమల్' చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా అక్కడ రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్‌లోని అభిమానులతో ముచ్చటించిన సందీప్ రెడ్డి, 'యానిమల్' సీక్వెల్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. 'యానిమల్‌ పార్క్‌' కచ్చితంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. సినిమా షూటింగ్‌కు, విడుదలకు సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను వెల్లడించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 'యానిమల్' సాధించిన భారీ విజయంతో సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడే నేరుగా టైమ్‌లైన్‌ ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :