Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : WhatsApp Accounts Ban : వాట్సాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల ప్రైవసీనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. మిలియన్ల మంది యూజర్లను కలిగిన వాట్సాప్ దేశంలోనే అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్‌లో ఒకటిగా ఉంది. దాంతో ఈ ప్లాట్‌ఫారమ్ స్కామ్‌లకు కేంద్రబిందువుగా మారింది. ఈ క్రమంలో వాట్సాప్ తమ యూజర్ల ఫిర్యాదులను నిరంతరం యూజర్ల రిపోర్టులను రివ్యూ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి అనుమానాస్పద అకౌంట్లను ముందస్తుగా నిషేధిస్తుంది. ఇటీవలే, వాట్సాప్ ప్రైవసీ విధానాలను ఉల్లంఘించినందుకు ఒకే నెలలో 8 మిలియన్లకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. వాట్సాప్ తాజా నివేదిక ప్రకారం.. గత ఆగస్టులో భారత్‌లో 8,458,000 మంది యూజర్ల అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్.. 2021లోని రూల్ 4(1)(డి), రూల్ 3A(7)కి అనుగుణంగా ఆయా అకౌంట్లను బ్యాన్ చేసింది. వాట్సాప్ రూల్స్ బ్రేక్ చేసే అకౌంట్లపై నిఘా ఉంచుతుంది. భారత చట్టం ప్రకారం చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే అకౌంట్లను వెంటనే బ్యాన్ చేస్తుంది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య వాట్సాప్ మొత్తం 8,458,000 భారతీయ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఇందులో 1,661,000 అకౌంట్లు ముందస్తుగా బ్యాన్ అయ్యాయి. అంటే.. ఏవైనా యూజర్లు ఫిర్యాదులు అందకముందే వాటిని గుర్తించి నిషేధం విధించింది. వాట్సాప్ ఆటోమాటిక్ సిస్టమ్ ద్వారా ఈ చర్యలను అమలు చేస్తుంది. బల్క్ మెసేజింగ్ లేదా ఇతర అసాధారణ కార్యకలాపాలు, తరచుగా స్కామ్‌లు లేదా దుర్వినియోగం గురించి ముందస్తుగా గుర్తించి సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకుంటుంది. యూజర్ రిపోర్ట్‌లకు సంబంధించి, వాట్సాప్ ఆగస్టు 2024లో ఫిర్యాదుల మెకానిజమ్‌ల ద్వారా 10,707 యూజర్ ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 93 ఫిర్యాదులపై వాట్సాప్ చర్యలు తీసుకుంది. ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సూచించిన ఇమెయిల్, పోస్టల్ ఛానెల్‌ల ద్వారా సమర్పించిన యూజర్ల రిపోర్టులను పరిశీలించి కూడా బ్యాక్ అప్పీళ్లు, అకౌంట్ సెక్యూరిటీ, భద్రతా సమస్యలను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది.
Admin
Studio18 News