Saturday, 24 January 2026 07:37:16 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు

Date : 22 May 2025 03:57 PM Views : 458

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంలో మరోసారి భద్రతా వైఫల్యం చర్చనీయాంశమైంది. సల్మాన్ ఖాన్‌ను కలవాలనే కారణంతో ఓ వ్యక్తి ఆయన ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి చొరబడ్డాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని జితేంద్ర కుమార్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 20వ తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో జితేంద్ర కుమార్ సింగ్, సల్మాన్ ఖాన్ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా, ఆగ్రహంతో తన వద్ద ఉన్న ఫోన్‌ను విసిరేశాడు. అదే రోజు సాయంత్రం మళ్లీ సల్మాన్ ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఈసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి వెళుతున్న మరో నివాసితుడి కారు వెనుక నక్కి, లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అడ్డుకుని, బాంద్రా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జితేంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చానని, సల్మాన్ ఖాన్‌ను కలవడం కోసమే ఇలా చేశానని జితేంద్ర చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తనను కలవడానికి అనుమతించకపోవడంతోనే కారు వెనుక దాక్కుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశానని అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :