Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sudheer Babu – Mahesh Babu : హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ అవుతాడని తెలిసిందే. సుధీర్ బాబు దసరాకు మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవల మహేష్ బాబే లాంచ్ చేసాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. తాజాగా సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ అంతగా రియాక్ట్ అవ్వడు. నేనేదైనా మూవీ కంటెంట్ పంపిస్తే బాగుంది, గుడ్.. అంటూ ఇలా సింపుల్ గా రిప్లైలు ఇస్తాడు. కానీ మా నాన్న సూపర్ హీరో టీజర్ పంపినప్పుడు హార్ట్ టచింగ్ అని రిప్లై ఇచ్చాడు. మొదటిసారి మహేష్ ఆ పదం వాడాడు నా సినిమాలకు. ట్రైలర్ ముందు రఫ్ కట్ పంపించాము. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ రోజు చూసి నేను అప్పుడు బిజీగా ఉండటం వల్ల రఫ్ ట్రైలర్ చూడలేదు. ఇప్పుడే ట్రైలర్ చూసాను, చాలా బాగుంది అని చాలా ఎమోజిలు పెట్టాడు. మహేష్ మొదటిసారి అన్ని ఎమోజిలు పెట్టి బాగుంది అని చెప్పడం, అంతలా రియాక్ట్ అవ్వడం మహేష్ ఇదే మొదటిసారి, మహేష్ కి ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చిందని అర్ధమవుతుంది అని తెలిపారు.
Admin
Studio18 News