Monday, 08 December 2025 03:33:42 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Gummadi Narasaiah | గుమ్మడి నర్సయ్యగా శివరాజ్‌కుమార్‌.. ఫస్ట్‌ లుక్‌తోనే హైప్‌ పెంచుతున్న డెబ్యూ డైరెక్టర్

gummadi narasaiah | నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రస్థానం. ఇప్పుడ

Date : 22 October 2025 08:08 PM Views : 166

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Gummadi Narasaiah | పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ వేత్తగా, ప్రజా నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రస్థానం. ఇప్పుడు ఆయన బయోపిక్‌ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ చిత్రానికి గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. ఆయన పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేసి మొదటి ప్రయత్నంలోనే అందరి ఫోకస్ తనవైపునకు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్ కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్‌ (Shiva rajkumar)కు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని తెలిసిందే. ఈ కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్‌ గుమ్మడి నర్సయ్యగా కనిపించబోతున్నాడు. తెలుగు రంగు చొక్కా, ధోతిలో భుజాన ఎర్ర కండువా వేసుకుని సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్నాడు. సైకిల్ హ్యాండిల్‌కు సీపీఐఎంఎల్‌ జెండాను చూడొచ్చు. అసెంబ్లీ ముందు నుంచి మిగిలిప ప్రజాప్రతినిధులంతా బుగ్గ కార్లలో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సాదాసీదాగా సామాన్య వ్యక్తిలా సైకిల్‌తో రావడం గమనించవచ్చు. ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ.. అందరినీ ఆలోచింపజేసేలా సినిమా ఉండబోతున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్‌ పరమేశ్‌ హివ్‌రాలే. ఈ చిత్రాన్ని ప్రవళ్లిక ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎన్‌ సురేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. చిరు గొడవలు, లావణ్య విత్ లవ్‌ బాయ్స్ సినిమాల్లో నటించిన పరమేశ్‌ హివ్‌రాలే ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :