Saturday, 07 March 2026 08:32:31 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

ఆసక్తికర ఫొటో పంచుకున్న సమంత... సోషల్ మీడియాలో వైరల్!

Date : 08 May 2025 01:24 PM Views : 354

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత నటి సమంత నిర్మాతగా కూడా చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 'ట్రాలాల మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై సమంత చిత్రాలను నిర్మిస్తున్నారు. అయితే, నాగచైతన్య విడాకుల అనంతరం రెండో వివాహం చేసుకున్నా, సమంత మాత్రం సింగిల్ గానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో దర్శకుడు రాజ్‌తో సమంత కలిసి నటించారు. ఆ తర్వాత కూడా రాజ్, సమంత సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య సంబంధం ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే, తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకున్నారు. దానికి వ్యాఖ్యగా "చాలా పెద్ద దారి దాటి బలంగా తయారయ్యాను.. ఇక కొత్త ప్రయాణం మొదలైంది.." అంటూ చివరిగా 'శుభం' సినిమా విడుదల తేదీని పేర్కొంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో దర్శకుడు రాజ్‌తో సమంత దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, సమంత అతనితో దిగిన ఫోటోలను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :