Saturday, 07 March 2026 09:22:10 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Sulakshana: పాలడబ్బా కోసం 'ముక్కుపుడక' అమ్ముకున్నాను: నటి సులక్షణ

Date : 25 September 2024 12:31 PM Views : 462

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలనటిగా .. కథానాయికగా సులక్షణ చాలా సినిమాలలో నటించారు. తెలుగులో కంటే కూడా తమిళంలో ఆమె ఎక్కువ సినిమాలను చేశారు. ఇక మలయాళ .. కన్నడ సినిమాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కెమెరా ముందుకు ఆమె రాక చాలా కాలమైనా, ఆ తరం ప్రేక్షకులు ఆమెను మరిచిపోలేదు. అలాంటి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. " నేను 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను .. 23 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు .. విడాకులు కూడా అయిపోయాయి. ఎందుకు విడిపోయామనేది నేను పూర్తిగా చెప్పలేను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము .. కానీ పెళ్లి తరువాత ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు. పిల్లలు తనకి అవసరం లేదని ఆయన కోర్టులోనే చెప్పారు. ఇద్దరు పిల్లలతో .. కట్టుబట్టలతో బయటికి వచ్చాను. నాకు రెంట్ ఇల్లు కూడా దొరక్కుండా చేయాలని ఆయన చూశారు. అత్తమామలు పట్టించుకోకపోవడం వలన, ఒంటరి పోరాటం మొదలుపెట్టాను" అని చెప్పారు. "నా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మంచి మనిషి ఇల్లు అద్దెకి ఇచ్చారు. పాలడబ్బాకి కూడా డబ్బులు లేవు. 6 నెలల వరకూ పాల డబ్బాలకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో నా 'ముక్కుపుడక' అమ్మేశాను. ఆ డబ్బుతో పాల డబ్బాలు తెచ్చిపెట్టుకున్నాను. నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. అందువల్లనే మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాను .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారాను. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచన చేయలేదు. నా కష్టాలు ఎవరికీ చెప్పుకోనూ లేదు" అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :