Sunday, 08 March 2026 10:55:26 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Pawan Kalyan: సెప్టెంబర్ 23 నుంచి 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పవన్ కల్యాణ్‌

Date : 20 September 2024 02:15 PM Views : 287

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో బిజీగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ మరో వైపు తన సినిమాల చిత్రీకరణకు కూడా సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'హరి హర వీర మల్లు' మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇంతకు ముందు పవన్‌కల్యాణ్‌ బిజీ షెడ్యూల్‌ను అర్థం చేసుకున్న నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఇతర సన్నివేశాల చిత్రీకరణ, చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇక తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యతపై కూడా తనపై ఉందని భావించిన పవన్ కల్యాణ్‌... హరి హర వీర మల్లు మొదటి భాగం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. నిర్మాతలు సమయం వృథా కాకుండా విజయవాడలోనే వేసిన సెట్‌లో హరి హర వీర మల్లు షెడ్యూల్‌ను చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్కడ 'హరి హర వీర మల్లు' కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఇంతకు ముందు నిక్‌ పావెల్‌ బ్రేవ్‌హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు. ఇక, క్రిష్‌ స్థానంలో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రం బ్యాలెన్స్‌ షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో వున్నారు. ఈ విజయవాడ షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా తుదిదశకు చేరుకుంటుందని నిర్మాత ఏ.ఏం రత్నం తెలిపారు. పవన్ కల్యాణ్‌ ఓ యోధుడుగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల డేట్‌ను కూడా ప్రకటిస్తారని సమాచారం. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :