Thursday, 12 March 2026 03:52:41 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chiranjeevi : చిరంజీవి ఇంటికి క్యూ కడుతున్న దర్శకులు.. కథలను వింటూ సినిమాలు లైన్లో పెడుతున్న మెగాస్టార్..

యువ డైరెక్టర్‌లతో సినిమాలు చేసేందుకు మెగాస్టార్‌ ఆసక్తి చూపిస్తున్నాడు.

Date : 20 March 2025 12:47 PM Views : 235

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi : సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లెట్‌ రేంజ్ స్పీడ్ చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రాబోయే సినిమాలపై భారీ కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దీనికి తోడు వరుసగా కొత్త కథలు వింటున్నాడు. దీంతో ఆదివారం కూడా మెగాస్టార్‌కు తీరిక లేకుండా పోతుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గాసిప్స్‌ వినిపిస్తున్నాయ్. యువ డైరెక్టర్‌లతో సినిమాలు చేసేందుకు మెగాస్టార్‌ ఆసక్తి చూపిస్తున్నాడు. దీంతో తమ లక్ టెస్ట్‌ చేసుకునేందుకు స్టోరీలు చేతిలో పట్టుకొని మెగాస్టార్ ఇంటికి క్యూ కడుతున్నారట యంగ్ డైరెక్టర్లు. ప్రతీ కథ వింటున్న చిరు ఆచితూచి సెలక్ట్‌ చేసుకుంటున్నాడని టాక్. కథలు చేతిలో పట్టుకొని మెగాస్టార్ వెంటపడుతున్న డైరెక్టర్స్‌లో కొంతమందికి అవకాశాలు కన్ఫార్మ్ అవగా మరికొందరు మాత్రం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు.

ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభ‌ర‌ సినిమా చేస్తున్న మెగాస్టార్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ కామిడీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడు. దీని తర్వాత దసరా ఫేమ్‌ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్యలాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్‌ బాబీతోనూ చిరు ఓ మూవీ కమిట్ అయ్యాడని టాక్‌. ఇప్పుడు మరో యంగ్‌ డైరెక్టర్ వెంకీ అట్లూరితోనూ సినిమా కన్ఫార్మ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే బాబీ, వెంకీ అట్లూరి సినిమాలు కాస్త ఆలస్యం అయ్యే చాన్స్ ఉందంట. వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణలతో కూడా సినిమాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి కానీ అవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అని తెలుస్తుంది. చిరంజీవి యువ దర్శకుల కథలు వింటుండటంతో చిరుని ప్రేరణగా తీసుకొని సినీ పరిశ్రమలోకి వచ్చిన దర్శకులంతా చిరు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక్క చాన్స్ అంటూ చిరుకు కథలు వినిపిస్తున్న డైరెక్టర్లు పెద్ద ప్లానే వేశారట. చిరుతో సినిమా చేసి సక్సెస్‌ కొట్టి తర్వాత చరణ్ దగ్గరకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్‌కి హిట్ ఇస్తే చరణ్‌తో సినిమా చేయడానికి ఈజీ అవుతుందని లెక్కలేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఎంతమంది మెగాస్టార్‌కి హిట్ ఇస్తారో, లేదా చిరునే తనకు సెట్ అవ్వకపోతే చరణ్ దగ్గరికి పంపిస్తారో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :