Thursday, 12 March 2026 03:28:36 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత 'మిరాయ్' విజయంతో నా ఫోన్ మోగుతూనే ఉంది: మంచు మనోజ్

Date : 13 September 2025 07:11 PM Views : 455

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉందన్న మంచు మనోజ్ నన్ను నమ్మిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటానని వ్యాఖ్య నాతో పాటు నా కుటుంబాన్ని నిలబెట్టారన్న మంచు మనోజ్ పన్నెండేళ్ల తర్వాత తన సినిమా విజయం సాధించడంతో తన ఫోన్ నిరంతరం మోగుతోందని, ఈ రోజు ఎంతో ఆనందంగా ఉందని సినీ నటుడు మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం మొదటి రోజునే రూ. 27 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, తనను నమ్మిన దర్శక నిర్మాతలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని అన్నారు. ఈ విజయం పట్ల తనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, ఇదంతా ఒక కలలా అనిపిస్తోందని అన్నారు. ఈ కథలో తనను భాగం చేసినందుకు దర్శకుడు కార్తీక్‌కు ప్రత్యేకంగా రుణపడి ఉంటానని మనోజ్ పేర్కొన్నారు. గతంలో ఎక్కడికి వెళ్లినా సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవారని, బయటకు ధైర్యంగా సమాధానం చెప్పినప్పటికీ లోపల ఒక తెలియని భయం ఉండేదని ఆయన అన్నారు. అనేక సినిమాలు చివరి నిమిషంలో రద్దయ్యాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒకటి తలిస్తే మరొకటి జరిగేదని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక్ తనను నమ్మడం అదృష్టమని ఆయన కొనియాడారు. తనకు ఈ అవకాశం ఇవ్వడం ద్వారా తనను మాత్రమే కాకుండా, తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారని అన్నారు. 'మనోజ్‌తో సినిమా వద్దని' చాలామంది చెప్పి ఉంటారని, అయినప్పటికీ విశ్వప్రసాద్ గారు ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన అన్నారు. 'మిరాయ్' వీఎఫ్ఎక్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసిందని మనోజ్ ప్రశంసించారు. "ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం" అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :