Saturday, 24 January 2026 01:38:42 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pooja Hegde: అల్లు అర్జున్ సినిమాలో బంపరాఫర్ కొట్టేసిన పూజా హెగ్డే

Date : 22 October 2025 06:30 PM Views : 242

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అల్లు అర్జున్-అట్లీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రత్యేక గీతం కోసం రూ. 5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ 'కూలీ' సక్సెస్ తో పూజకు పెరిగిన డిమాండ్ అన్న ప్రచారం రూ. 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారంటూ వార్తలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‍లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది. ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ' సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్‍కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాట విజయంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అల్లు అర్జున్, అట్లీలు తమ సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అయితే కచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా విజయంలో ఈ పాట కీలకమవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‍తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‍తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‍గా దీన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఏకంగా ఆరుగురు కథానాయికలు నటించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. వారిలో దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి ప్రముఖ తారల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :