Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఆయన లక్నో వెళుతుండగా మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. నేడు (నవంబరు 9) గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ కార్యక్రమం లక్నోలో జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన మాలధారణ చేసి ఉండడంతో, నల్ల దుస్తుల్లో, కాళ్లకు చెప్పుల్లేకుండా కనిపించారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలయ్యే టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరగనున్నాయి. నిన్ననే టీజర్ ప్రోమో రిలీజ్ కావడంతో, అభిమానులు టీజర్ కోసం తహతహలాడుతున్నారు.
Also Read : చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి... ఏపీ ప్రభుత్వ నిర్ణయం
Admin
Studio18 News