Sunday, 08 February 2026 01:31:50 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

చిరు-అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ ఫిక్స్.. ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేసిన మేక‌ర్స్

Date : 17 May 2025 01:59 PM Views : 547

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ (మెగా 157) తెర‌కెక్కనున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పూజాకార్య‌క్ర‌మాలు కూడా జరుపుకుంది. త్వ‌ర‌లోనే చిత్ర‌ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతోన్నారు మేక‌ర్స్‌. ఈ లోపు చిరు కోసం అనిల్ క‌థానాయిక‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార‌ నటిస్తోందని పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేక‌ర్స్ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు తాజాగా ఓ వీడియోను కూడా విడుద‌ల చేశారు. 'మెగా 157' ప్రాజెక్ట్‌లోకి నయన్ వచ్చిందంటూ వదిలిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. మ‌రోసారి అనిల్ రావిపూడి త‌న‌దైన‌శైలిలో ఈ వీడియోను రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే... అసలు ప్రమోషన్స్ అంటే నో చెప్పే నయన్‌తోనే సినిమా ఆరంభానికి ముందే ఆమెను అనిల్ ప్రమోషన్స్‌లోకి తీసుకొచ్చార‌నే చెప్పాలి. వీడియో చివ‌ర్లో సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని ఇద్దరూ (న‌య‌న్‌, అనిల్) చిరు ఐకానిక్ పోజులు పెట్టడం ఆక‌ట్టుకుంటోంది. అలాగే చిరంజీవి మేన‌రిజంలో హలో మాస్టారు... కెమెరా కొద్దిగా రైట్ ట‌ర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ చెప్పిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోకి ఆమెను ఆహ్వానిస్తూ చిరంజీవి కూడా పోస్టు పెట్టారు. "హ్యాట్రిక్ మూవీకి స్వాగ‌తం. ఆమెతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది" అని చిరు అన్నారు. కాగా, చిరు, న‌య‌న్ కాంబినేష‌న్‌లో ఇదివ‌రకే ఈ 'సైరా న‌ర‌సింహారెడ్డి', 'గాడ్ ఫాద‌ర్' చిత్రాలు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. భీమ్స్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. మ‌రోవైపు ఇప్ప‌టికే విశ్వంభ‌ర‌ను పూర్తి చేసిన చిరంజీవి... అనిల్ మూవీ త‌ర్వాత ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలాతో మ‌రో సినిమా చేయ‌నున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :