Monday, 19 January 2026 07:06:49 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Samantha Ruth Prabhu: నా విడాకుల సమయంలో కొందరు సంబరాలు జరుపుకున్నారు: సమంత

Date : 23 October 2025 08:06 PM Views : 217

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తన వ్యక్తిగత జీవితంపై సమంత ఎమోషనల్ కామెంట్స్ అనారోగ్యంతో బాధపడుతుంటే ఎగతాళి చేశారని వెల్లడి అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశానన్న సామ్ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారంటూ ప్రముఖ నటి సమంత ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు, అనారోగ్య సమస్యలతో తాను తీవ్రంగా బాధపడుతుంటే, తనను ద్వేషించే వాళ్లు ఎగతాళి చేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, "నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, మయోసైటిస్ బారిన పడినప్పుడు కొందరు పైశాచిక ఆనందం పొందారు. నా భవిష్యత్తుపై వారే నిర్ణయాలు తీసుకున్నట్లు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు మొదట్లో నన్ను చాలా బాధపెట్టాయి, కానీ ఇప్పుడు అలాంటి వారిని పట్టించుకోవడం పూర్తిగా మానేశాను" అని స్పష్టం చేశారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. ఆమె ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. "సమంత ఒక నిజమైన ఫైటర్" అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు, తెలుగులో దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘బేబీ’ సినిమా విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :