Monday, 19 January 2026 08:02:13 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Dandora Movie: ఆసక్తికరంగా 'దండోరా' టీజర్‌

Date : 17 November 2025 06:34 PM Views : 255

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలంగాణ నేపథ్య కథతో 'దండోరా' ఇంట్రెస్టింగ్‌ పాత్రలు, అలరించే సంభాషణలు అలరిస్తున్న టీజర్‌ ఆసక్తికరమైన పాత్రలు, ఆలోచింపజేసే సంభాషణలతో విడుదలైన ‘దండోరా’ టీజర్ అందరినీ అలరిస్తోంది. 'కోర్టు' సినిమాలో మంగపతిగా అలరించిన శివాజీ మరోసారి ఓ విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ నిర్మాత. డిసెంబర్ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే దర్శకుడు ప్రతి పాత్రను పరిచయం చేసి, ఆ పాత్ర విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేశాడు. సర్పంచ్ పాత్రలో నవదీప్ చెప్పే సంభాషణలు ఆసక్తిగా, హాస్యంతో కూడుకున్నాయి. "హైదరాబాద్ పో.. అమెరికా పో.. ఎక్కడికైనా పో.. చస్తే ఇక్కడికే తేవాలె.." లాంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే, శివాజీ పాత్రలోని "చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద" అనే డైలాగ్, వేశ్య పాత్రలో బిందు మాధవి చెప్పే "ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్ళు డబ్బులిస్తున్నారు.. నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను" అనే డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సమాజంలోని అగ్ర వర్ణాల అరాచకాలను ప్రశ్నిస్తూ, సామాజిక స్పృహను కలిగించే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని సంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, హాస్యం, హృదయాలను బరువెక్కించే ఎమోషన్స్‌ను మిక్స్ చేసి దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆకట్టుకునే పాత్రలతో, ఆలోచింపజేసే సంభాషణలతో 'దండోరా' టీజర్ ఆకట్టుకుంది. 'దండోరా' సినిమా విడుదలకు ముందు రావాల్సిన బజ్‌కు ఈ టీజర్ ఒక ప్రారంభంలా ఉందని చెప్పవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :