Monday, 19 January 2026 07:37:17 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Andrea | పిశాచి 2లో న్యూడిటీ లేదు.. కానీ చాలా ఎరోటిక్ సీన్లుంటాయి : ఆండ్రియా

Andrea | ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పిశాచి 2 పలు ఆర్థికపరమైన చిక్కులతో ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే పిశాచి 2లో న్యూడ్‌ కంటెంట్‌ ఉండబోతుం

Date : 26 November 2025 07:06 PM Views : 158

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Andrea | కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కించిన హార్రర్ మూవీ పిశాచి బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత పలు భాషల్లో కూడా రీమేక్‌ అయింది. ప్రస్తుతం మిస్కిన్‌ ఈ బ్లాక్‌బస్టర్‌ సీక్వెల్‌పై పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో తమిళ నటి, గాయని ఆండ్రియా జెర్మియా లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సీక్వెల్‌ పలు ఆర్థికపరమైన చిక్కులతో ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే పిశాచి 2లో న్యూడ్‌ కంటెంట్‌ ఉండబోతుందని నెట్టింట పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆండ్రియా. స్క్రిప్ట్‌ దశలో న్యూడిటి ఉండేది.. కానీ షూటింగ్‌ వరకు వచ్చే సరికి మిస్కిన్‌ సార్ ఆ పోర్షన్లను తీసేశారు. దానికి గల కారణమేంటనేది మాత్రం తనకు తెలియదని ఆండ్రియా చెప్పింది. పిశాచి 2లో న్యూడిటీ లేదు.. కానీ చాలా ఎరోటిక్ సీన్లుంటాయి. మిస్కిన్‌ సార్ ఈ సినిమాను మనుగడ (అస్తిత్వం)కోసం చేయడం లేదు. గతంలో ఆయన చాలా మంది పెద్ద హీరోలతో పనిచేశారు. అలాంటి డైరెక్టర్‌ ఓ పాత్ర కోసం నన్నేదైనా చేయాలని అడిగితే.. నేను ఆయన విజన్‌ నమ్మాలి. ఆయన ఉద్దేశం వేరే ఉంది. కొంతమంది నా స్కర్ట్‌ను కూడా కిందకి లాగమని అడిగారని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ కామెంట్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ హార్రర్ చిత్రంలో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి కామియో రోల్‌లో నటిస్తుండగా.. పూర్ణ, సంతోష్‌ ప్రతాప్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టీ మురుగనంథం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు తెలుగు రాష్ట్రాల్లో థ్రియాట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :