Thursday, 12 March 2026 01:08:25 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Ram Gopal Varma: శివాజీకి 'రాజా సాబ్' హీరోయిన్లతో ఆర్జీవీ కౌంటర్

Date : 29 December 2025 06:44 PM Views : 116

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నటుడు శివాజీపై మరోసారి విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ 'రాజా సాబ్' హీరోయిన్లను ఉదాహరణగా చూపిన వైనం శివాజీ వ్యాఖ్యలను పట్టించుకోలేదంటూ హీరోయిన్లను ప్రశంసించిన ఆర్జీవీ మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి ఘాటుగా స్పందించారు. శివాజీ మోర‌ల్ పోలీసింగ్‌ను విమర్శిస్తూ, ప్రభాస్ కొత్త సినిమా 'ది రాజా సాబ్' హీరోయిన్లను ఉదాహరణగా చూపించారు. ఆ ముగ్గురు హీరోయిన్లను హీరోలుగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన 'రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోను ఆర్జీవీ తన 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఉన్నారు. ఈ ఈవెంట్‌లో వారి వస్త్రధారణను ప్రస్తావిస్తూ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "శివాజీ, అతని బ్యాచ్ చేస్తున్న నైతిక విమర్శలను ప్రభాస్ హీరోయిన్లు ముగ్గురూ పట్టించుకోలేదు. వాళ్లకు నచ్చిన డ్రెస్సులే వేసుకున్నారు. ఆ విలన్లకు గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన 'ముగ్గురు హీరోల'కు (హీరోయిన్లకు) హ్యాట్సాఫ్" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా ఇదే విష‌యమై శివాజీపై ఆర్జీవీ తీవ్రంగా మండిపడ్డారు. "మీ నీతులు మీ ఇంట్లో మహిళలకు చెప్పుకోండి... సమాజంలోని ఇతర మహిళలకు కాదు" అంటూ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :