Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Aadi Saikumar : ఆది సాయి కుమార్ ఇటీవల కొత్త కొత్త కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. త్వరలో షణ్ముఖ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు. ఆది సాయి కుమార్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ‘శంబాల’ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ టైటిల్ పోస్టర్‌లో.. ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం.. ఇలా ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జానర్లో ఈ శంబాల సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలో గతంలో ఏ సినిమాలో ఎక్స్‌పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను వినిపించబోతున్నారు అని తెలుస్తుంది.
Admin
Studio18 News