Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆర్థిక సంవత్సరం 2024-2025 ఈ నెల 31తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. వ్యాపారాలు, పన్నులు, ప్రభుత్వ బడ్జెట్లకు సంబంధించిన కొత్త గణాంకాలు ఏప్రిల్ 1 నుంచి షురూ అవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి.. అంటే మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా పలు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే జరిమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మార్చి 31లోపు ఐటీకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
ఆర్థిక సంవత్సరం 2024-2025 ఈ నెల 31తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. వ్యాపారాలు, పన్నులు, ప్రభుత్వ బడ్జెట్లకు సంబంధించిన కొత్త గణాంకాలు ఏప్రిల్ 1 నుంచి షురూ అవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి.. అంటే మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా పలు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే జరిమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మార్చి 31లోపు ఐటీకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్లు పాత పన్ను విధానం కింద పన్నుల తగ్గింపు ప్రయోజనాలు పొందాలంటే ఈ కింది వాటిని మార్చి 31లోపు పూర్తి చేయాలి. ఈ కింది వాటి ద్వారా పన్ను తగ్గింపు ప్రయోజనాలను పాత పన్ను విధానంలో పొందవచ్చు. సెక్షన్ 80సీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) సెక్షన్ 80డీ: ఆరోగ్య బీమా ప్రీమియంలు సెక్షన్ 80జీ: చారిటేబుల్ ఇన్‌స్టిట్యూషన్లకు విరాళాలు ఐటీ రిటర్నులు పన్ను చెల్లింపుదారులు 2022–23 అసెస్‌మెంట్ ఇయర్‌లో ఐటీఆర్ వేయకపోయినా, అందులో ఏమైనా తప్పులు ఉన్నా మార్చి 31లోపు కొత్త రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. దీంతో భవిష్యత్తులో నోటీసులు, జరిమానాలను రాకుండా చూసుకోవచ్చు. చలాన్, స్టేట్‌మెంట్‌లను సబ్మిట్ చేయండి ఈ కింద విభాగాల కింద 2025 ఫిబ్రవరిలో మీకు పన్ను మినహాయింపులు దక్కితే చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను మార్చి 30లోపు సమర్పించాలి. ఈ గడువులను దాటితే వడ్డీ, జరిమానాలు పడొచ్చు. సెక్షన్ 194ఎం: కాంట్రాక్టర్లు లేదా నిపుణులకు చెల్లింపులకు సంబంధించిన చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను సబ్మిట్ చేయండి సెక్షన్ 194-ఐఏ: ఆస్తి లావాదేవీలపై టీడీఎస్ సెక్షన్ 194-ఐబీ: అద్దె చెల్లింపులపై టీడీఎస్ విదేశాల్లో వచ్చే మీ ఆదాయాన్ని తెలపండి విదేశీ పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేసే పన్ను చెల్లింపుదారులు మార్చి 31 నాటికి ఆయా దేశాల్లో వచ్చిన ఆదాయం, చెల్లించిన పన్నును అప్‌లోడ్ చేయాలి. ఇది సెక్షన్ 139(1) లేదా 139(4) కింద దాఖలు చేసిన రిటర్న్‌లకు వర్తిస్తుంది.
Admin
Studio18 News