Monday, 19 January 2026 08:14:48 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Paanch Minar Movie Review

Date : 02 December 2025 06:12 PM Views : 96

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన 'పాంచ్ మినార్' నవంబర్ 28 నుంచి మొదలైన స్ట్రీమింగ్ కామెడీని మాత్రమే నమ్ముకున్న కంటెంట్ లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి దూరంగా సాగే కథ ఓ మాదిరిగా అనిపించే సినిమా రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన సినిమానే 'పాంచ్ మినార్'. రాశి సింగ్ ఆయన జోడీకట్టింది. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఒక వారంలోనే ఓటీటీకి వచ్చేసింది. నవంబర్ 28వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ: కిట్టూ (రాజ్ తరుణ్) తన తల్లిదండ్రులు .. చెల్లెలితో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. కిట్టూ వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కూతురు పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బు కోసమే కిట్టూ వాళ్ల నాన్న (బ్రహ్మాజీ) నానా పాట్లు పడుతూ ఉంటాడు. ఎక్కడా జాబ్ దొరక్కపోవడంతో, బిజినెస్ చేయడానికి ట్రై చేసిన కిట్టూ, తన చెల్లెలి కోసం తండ్రి దాచిన డబ్బు కాస్తా పోగొడతాడు. అతనికి జాబ్ వస్తే తమ పెళ్లికి తండ్రిని ఒప్పించాలని ఖ్యాతి (రాశి సింగ్) వెయిట్ చేస్తూ ఉంటుంది. హైదరాబాదులో ఛోటు (రవి వర్మ) గ్యారేజ్ ముసుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆయన ప్రధానమైన అనుచరుడిగా మూర్తి ( అజయ్ ఘోష్) ఉంటాడు. 'ఛోటూ'కి దక్కవలసిన 5 కోట్ల రూపాయలను గణేశ్ అనే ఒక అనుచరుడు ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టి చనిపోతాడు. అప్పటి నుంచి 'ఛోటూ' ఆ డబ్బు కోసం గాలిస్తూనే ఉంటాడు. అతనికి మూర్తి కదలికలపై కూడా కాస్త అనుమానంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 'క్యాబ్' డ్రైవర్ గా మారిన కిట్టూ, మూర్తి గ్యారేజి నుంచి ఒక కారును తీసుకుంటాడు. ఆ క్యాబ్ లో వెళ్లిన ఇద్దరు కిరాయి హంతకులు, 'ఛోటూ'ను షూట్ చేసి చంపేస్తారు. డ్రైవర్ గా ఉన్న కిట్టూ షాక్ అవుతాడు. ఈ కేసు విషయంలో మూర్తిని బ్లాక్ మెయిల్ చేయడానికి సీఐ గోవింద్ అయ్యర్ ట్రై చేస్తుంటాడు. ఒక పెద్ద ఎమౌంట్ 'పాంచ్ మినార్' అనే కోడ్ పై ఒకచోటున భద్రపరచబడి ఉందని కిట్టూ తెలుసుకుంటాడు. అప్పుడతను ఏం చేస్తాడు? ఫలితంగా అతని ఫ్యామిలీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? అనేది మిగతా కథ. విశ్లేషణ: కొంతమంది కుర్రాళ్లు బద్దకంతో కలిసి బ్రతుకుతుంటారు. తాపీగా తాగేసి .. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూల్ గా బ్రతికేయడానికే వాళ్లు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు బరువు బాధ్యతలకు దూరంగా పారిపోతుంటారు. అలాంటి ఒక కుర్రాడు ఈజీగా డబ్బు సంపాదించాలనీ .. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈజీ మనీ ఎలాంటి కష్టాలు తెచ్చి పెడుతుందనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ కథలో డబ్బు కోసం హీరో పరుగులు పెడుతూ ఉంటాడు. అతణ్ణి పట్టుకోవడానికి ఒక వైపున లోకల్ రౌడీ గ్యాంగ్ .. మరొక వైపున కిరాయి హంతకులు .. ఇంకొక వైపున అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ వెంటాడుతూ ఉంటారు. వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి హీరో వేసే వేషాలు .. తమాషాలకు కామెడీ టచ్ ఇస్తూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఈ గ్యాంగుల మధ్య గందరగోళం .. తికమకల మధ్య ఫన్ వర్కౌట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే కథను నడిపించే విధానాన్ని బట్టి చూస్తే, బోర్ అనిపించకుండా సాగిందనే చెప్పాలి. అయితే ఎక్కడా ఎమోషన్స్ వైపు వెళ్లకపోవడం వెలితిగా అనిపిస్తుంది. లవ్ .. రొమాన్స్ దిశగా అవకాశం ఉన్నప్పటికి, ఆ కోణాలను టచ్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించకపోవడం కనిపిస్తుంది. వినోదానికి అవసరమైన కొన్ని పాళ్లు తగ్గాయనే భావన కలుగుతుంది. పనితీరు: ఒక విలువైన వస్తువు కోసమో .. డబ్బు కోసమో .. కీలకమైన ఆధారం కోసమో, ఒకరి వెనుక ఒకరు పడే కథలతో కొన్ని సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఆ దారిలో ఈ కథను పరిగెత్తించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకు మాత్రమే ఫలించిందని చెప్పాలి. రాజ్ తరుణ్ .. అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆదిత్య జవ్వాది ఫొటోగ్రఫీ .. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం .. పవన్ పూడి ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. ముగింపు: లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి అవకాశం ఉండి కూడా, వాటికి దూరంగా నడిపించిన కథ ఇది. పూర్తిగా కామెడీని మాత్రమే నమ్ముకుని వెళ్లారు. అయితే ఆ కామెడీ విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. వినోదానికి అవసరమైన అన్ని పాళ్లు కుదరనందు వలన, ఓ మాదిరిగా అనిపిస్తుంది అంతే. Movie Details Movie Name: Paanch Minar Release Date: 2025-11-28 Cast: Rajtarun, Rasi Singh, Ajay Ghosh, Nithin Prasanna, Brahmajim Ravivarma Director: Ram Kadumula Music: Sekhar Chandra Banner: Connect Movies Review By: Peddinti Paanch Minar Rating: 2.00 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :