Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది. విశ్వవిద్యాలయం నుంచి వాహన అద్దెకు తీసుకున్న నిధులపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు ఇవ్వాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. వాహన అద్దె కింద తీసుకున్న నిధులను తిరిగి చెల్లించాలని రెండ్రోజుల్లో ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి 2024 మార్చి మధ్య కాలంలో సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో ఆమె 90 నెలలకు గాను వాహన అద్దె కింద రూ. 61 లక్షలు తీసుకున్నారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Admin
Studio18 News