Wednesday, 17 December 2025 02:48:52 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Devara: పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్‌!

Date : 20 September 2024 03:12 PM Views : 144

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ 'దేవర' చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతో పాటు రామ్‌చరణ్‌ సరసన కూడా ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ చిత్రం కూడా సెట్స్‌ మీదకు కూడా వెళ్లనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో కొనసాగే పీరియాడికల్‌ డ్రామాగా రూపొందనుంది. ఇక ఈ రెండు చిత్రాలతోనే జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ అగ్రహీరోయిన్‌ జాబితాలో చేరిపోయారు. దేవర ప్రమోషనల్‌ కంటెంట్‌ ద్వారా ఈమె క్రేజ్‌ మరింత పెరిగింది. దీంతో జాన్వీ తన పారితోషికాన్ని పెంచేసిందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. హీరో నాని-శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం కోసం నిర్మాతలు జాన్వీని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఆమె పారితోషికం తెలుసుకున్న వాళ్లు ఆ ఆలోచనను విరమించుకుని, మరో హీరోయిన్‌ అన్వేషణలో ఉన్నారని తెలిసింది. సదరు జాన్వీ ప్లేస్‌లో ఓ మిడ్‌ రేంజ్‌ హీరోయిన్‌ను తమ సినిమాలో తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇటీవలే 'సరిపోదా శనివారం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన నాని, త్వరలోనే శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న హిట్‌-3 సినిమా చిత్రీకరణలో పాల్గొంటాడు. 2025 జనవరి నుంచి నాని-శ్రీకాంత్‌ ఓదెల చిత్రం ప్రారంభం కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :