Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Khairatabad Ganesh : హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. హైదరాబాద్ లోనే భారీ విగ్రహంగా ఎన్నో ఏళ్లుగా వినాయక చవితిని గ్రాండ్ గా చేస్తున్నారు ఖైరతాబాద్ లో. గణేష్ నవరాత్రులు మొదలయినప్పటి నుంచి నిమజ్జనం వరకు ఖైరతాబాద్ వినాయకుడి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక నిమజ్జనం రోజు అయితే అందరి కళ్ళు ఖైరతాబాద్ గణేశుడి మీదే ఉంటాయి. నేడు వినాయక నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడు ఆల్రెడీ నిమజ్జనానికి బయలుదేరాడు. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ఆల్రెడీ షూట్ చేసిన పలు పాత వీడియోలు తీసుకొని కొన్ని సినిమాల్లో చూపించిన సంగతి తెలిసిందే. కానీ ఖైరతాబాద్ గణేశుడి వద్ద కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేసారని తెలుసా.. దివంగత లెజెండరీ దర్శకులు K విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సాగర సంగమం సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో ఒక సీన్ కమల్ హాసన్ ఓ భారీ వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అది ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన విగ్రహమే. ఆ ఏరియా కూడా ఖైరతాబాదే. అది 1983 ఖైరతాబాద్ విగ్రహం. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ముందు కమల్ హాసన్ తో డ్యాన్స్ సీన్ చేయించారు K విశ్వనాధ్. అయితే సాగర సంగమం సినిమా 1983 జూన్ లో రిలీజ్ అయింది. ఆ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్ లో వచ్చింది. దీంతో ఆ సీన్ కోసం ముందే 1983 ఖైరతాబాద్ వినాయకుడిని తయారుచేయించారు అని పలువురు వ్యాఖ్యానిస్తారు.
Admin
Studio18 News