Thursday, 12 March 2026 03:57:51 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Salaar | హాలీవుడ్ మూవీలో స‌లార్ బీజీఎం.. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా దించేశారా ఏంటీ..?

Salaar | ఇటీవ‌లే కొత్త హాలీవుడ్ సినిమా ది లాస్ట్ బ‌స్ ప్రోమో విడుద‌లైంది. అయితే ఈ ప్రోమో చూసిన కొంద‌రు నెటిజ‌న్లు స‌లార్ కాపీ అంటూ నెట్టింట ట్రోల్స్ మ

Date : 10 October 2025 06:33 PM Views : 217

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Salaar | చాలా రోజుల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే ఈ సారి మాత్రం రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా టాక్ ఆఫ్ ది సోష‌ల్ మీడియాగా నిలుస్తోంది. దీనిక్కార‌ణం ఏంట‌నుకుంటున్నారా..? ఇటీవ‌లే కొత్త హాలీవుడ్ సినిమా ది లాస్ట్ బ‌స్ ప్రోమో విడుద‌లైంది. అయితే ఈ ప్రోమో చూసిన కొంద‌రు నెటిజ‌న్లు స‌లార్ కాపీ అంటూ నెట్టింట ట్రోల్స్ మొద‌లుపెట్టారు. ఇంత‌కీ ఈ మూవీలో ఏం కాపీ చేశార‌నే క‌దా మీ డౌటు. కంటెంట్ అయితే కాదు కానీ నెటిజ‌న్ల టాక్ ప్ర‌కారం స‌లార్‌లోని బీజీఎంను కాపీ చేశార‌ని కామెంట్స్ ఊపందుకున్నాయి. ప్రశాంత్ నీల్ యాక్ష‌న్ డ్రామా ప్రాజెక్టుకు ర‌వి బ‌స్రూర్ అదిరిపోయే బీజీఎం అందించాడ‌ని తెలిసిందే. సినిమా స‌క్సెస్‌లో ఈ బీజీఎం కీ రోల్ పోషించింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ సినిమా ది లాస్ట్ బ‌స్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను వింటే 1:13 (నిమిషాల నిడివి నుంచి) స‌లార్ బీజీఎంలాగే ఉంటుంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ పోస్ట్ చేశాడు. సౌతిండియ‌న్ సినిమా ప్ర‌భావం చాలా ప‌డింద‌ని.. ఎంత‌లా అంటే హాలీవుడ్ కూడా మ‌న దగ్గ‌ర నుంచి కాపీ చేసుకునేలా అంటూ చాలా మంది మూవీ ల‌వ‌ర్స్ చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఇదిలా ఉంటే ది లాస్ట్ బ‌స్ ప్ర‌మోష‌న‌ల్‌ ప్రోమోలో కంపోజ‌ర్ ఎవ‌ర‌నేది చూపించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఇక ఈ విష‌య‌మై మాత్రం అటు స‌లార్ టీం నుంచి కానీ.. ఇటు ది లాస్ట్ బ‌స్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న బ‌య‌ట‌కు రాలేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం కామెంట్స్‌, ట్రోల్స్ వర్షం కురుస్తుంది. మ‌రి దీనిపై మేక‌ర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :