Sunday, 08 March 2026 10:34:49 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Vishal: విశాల్, ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Date : 29 August 2025 08:05 PM Views : 405

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కోలీవుడ్ నటుడు విశాల్, నటి సాయి ధన్సికల నిశ్చితార్థం విశాల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల హాజరు నడిగర్ సంఘం భవన నిర్మాణం తర్వాతే వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు కోలీవుడ్ యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత మే నెలలోనే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని విశాల్, ధన్సిక అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి, విశాల్ పుట్టినరోజైన ఈరోజే వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, విశాల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నడిగర్ సంఘం (తమిళ నటీనటుల సంఘం) భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించారు. ఇక నటి సాయి ధన్సిక విషయానికొస్తే, జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తన ప్రతిభతో ఎదిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రంలో ఆయన కూతురి పాత్రలో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంతో పాటు తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీగా ఉండగా, త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :