Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kavya Thapar : ముంబై భామ కావ్య థాపర్ తెలుగులో ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబల్ ఇస్మార్ట్ సినిమాలతో అలరించింది. త్వరలో విశ్వం సినిమాతో రాబోతుంది. గోపీచంద్ సరసన విశ్వం సినిమాలో కావ్య థాపర్ నటించింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా కావ్య థాపర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కావ్య థాపర్ మాట్లాడుతూ.. నేను మన కల్చర్స్ ఫాలో అవుతాను. నవరాత్రికి మన సంసృతిలో ఏం చేస్తారో అవన్నీ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను. మొదటి సారి నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నాను విశ్వం సినిమాకు మంచి విజయం రావాలని. కేవలం సాత్వికాహారం లాంటిది తీసుకుంటాను అని తెలిపింది. దీంతో ఇంటర్వ్యూలో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్ల సైతం ఆశ్చర్యపోయారు. తన సినిమా హిట్ అవ్వాలని ఉపవాసం ఉంటున్న ఈ ముద్దుగుమ్మని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ గ్లామర్ రోల్స్ తో, సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ తో బోల్డంత మంది ఫాలోవర్స్ ని, అభిమానులని సంపాదించుకుంది. తెలుగులో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కావ్య చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం.
Admin
Studio18 News