Thursday, 12 March 2026 01:13:56 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Javed Akhtar: మహిళా డాక్టర్ హిజాబ్ తొలగింపు: సీఎం నితీశ్‌పై జావేద్ అక్తర్ తీవ్ర ఆగ్రహం

Date : 18 December 2025 07:54 PM Views : 247

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మహిళా డాక్టర్ హిజాబ్ తొలగింపు ఘటనపై భగ్గుమన్న జావేద్ అక్తర్ నితీశ్ కుమార్ చర్యను తీవ్రంగా ఖండించిన ప్రముఖ రచయిత ఈ దుశ్చర్యను ఆమోదించలేనని స్పష్టీకరణ నితీశ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను బలవంతంగా తొలగించిన ఘటనపై బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇలా ప్రవర్తించడం దారుణమని, ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. బాధితురాలైన ఆ వైద్యురాలికి నితీశ్ కుమార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం పాట్నాలో ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమంలో నితీశ్ కుమార్.. ఓ ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్‌ను తొలగించడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు ఈ ఘటనను ఇప్పటికే ఖండించాయి. తాజాగా ఈ వివాదంపై జావేద్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నా గురించి తెలిసిన వాళ్లందరికీ నేను 'పరదా' (ముసుగు) విధానానికి వ్యతిరేకినని తెలుసు. కానీ, నేను దాన్ని వ్యతిరేకించినంత మాత్రాన, ఒక మహిళ పట్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడాన్ని సమర్థించలేను. నితీశ్ కుమార్ చేసిన పనిని ఏ రకంగానూ ఆమోదించలేం. ఈ దుశ్చర్యను తీవ్ర పదజాలంతో ఖండిస్తున్నాను. ఆయన వెంటనే ఆ మహిళకు క్షమాపణ చెప్పాలి" అని జావేద్ అక్తర్ తన పోస్టులో పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :