Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇటు ప్రభుత్వంలో పాలన చూసుకుంటూనే అటు సినిమాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి కష్టపడుతున్నారు పవన్. ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూట్ జరుగుతుంది. విజయవాడలో వేసిన భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. పవన్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది. హరిహర వీరమల్లు సెట్స్ నుంచి లీకైన ఈ ఫొటోలో పవన్ సినిమా కాస్ట్యూమ్ తో నవ్వుతూ ఉన్నారు. ఆ పక్కనే మరో ఆర్టిస్ట్ ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఒక్క ఫొటోకే సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు ట్రెండ్ అవుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. లీక్ అయిన ఫోటో మీరు కూడా చూసేయండి.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా మొదటి పార్ట్ మార్చ్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ఇటీవల ప్రకటించారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ పలువురు బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రల్లో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
Admin
Studio18 News