Saturday, 24 January 2026 02:09:36 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ranveer Singh: దూసుకుపోతున్న 'దురంధర్' .. 3 రోజుల్లో 100 కోట్లు!

Date : 08 December 2025 07:08 PM Views : 194

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈ నెల 5న విడుదలైన 'దురంధర్' తొలి ఆటతోనే అనూహ్యమైన రెస్పాన్స్ ప్రత్యేక ఆకర్షణగా భారీ తారాగణం 3 రోజుల్లో 118 కోట్ల గ్రాస్ వసూళ్లు మరిన్ని రికార్డులు ఖాయమనేది బాలీవుడ్ టాక్ బాలీవుడ్ సినిమా ఒకటి ఇప్పుడు బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేస్తోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా వాళ్లను ఆకట్టుకున్న సినిమానే 'దురంధర్'. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే ఈ సినిమా అందరిలోను ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. పోస్టర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు .. నమ్మకాలు పెరుగుతూ వెళ్లాయి. అలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. యాక్షన్ డ్రామా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిందనే టాక్ వినిపించింది. టాక్ కి తగినట్టుగానే రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతూ వెళ్లాయి. అలా వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. రణ్ వీర్ ఇంతకు ముందు చేసిన సినిమాలలో, 'పద్మావత్' .. 'సింబా' సినిమాలు తొలి మూడు రోజులలో 75 కోట్ల వసూళ్లను దాటాయి. ఆ రెండు సినిమాల వసూళ్లను అధిగమిస్తూ, ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను దాటేయడం విశేషం. ఈ సినిమా జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ రాంపాల్ .. అక్షయ్ ఖన్నా .. సారా అర్జున్ కనిపించనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ రేటుకు 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :