Monday, 19 January 2026 07:44:07 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

'ఉప్పు పులి కారం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

Date : 20 November 2025 07:34 PM Views : 162

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళంలో రూపొందిన సిరీస్ 128 ఎపిసోడ్స్ తో కూడిన కంటెంట్ తెలుగులోను అందుబాటులోకి ఆకట్టుకునే కథ .. ఆసక్తికర మలుపులు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సిరీస్ ఈ మధ్య కాలంలో ఓటీటీ సెంటర్లలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలకు కూడా థ్రిల్లర్ టచ్ ఇస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ 128 ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సిరీస్ పేరే 'ఉప్పు పులి కారం'. సౌత్ కొరియన్ సిరీస్ 'మై ఫాదర్ ఈజ్ స్ట్రేంజ్' ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. 2024 మే 30 నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకూ తమిళంలో సందడి చేసిన ఈ సిరీస్, ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. కథ: సుబ్రమణ్యం( పొన్ వణ్ణన్) సుబ్బలక్ష్మి (వనిత కృష్ణచంద్రన్) దంపతులు చెన్నై లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని హోటల్ నడుపుతుంటారు. వారి కొడుకే ఉదయ్ (నవీన్ మురళీధర్). అతను ఐఏఎస్ చేయాలనేది ఆ దంపతుల కోరిక. అందువలన కష్టపడి అతనిని చదివిస్తూ ఉంటారు. వారి పెద్దమ్మాయి చిన్మయి (ఆయేషా జీనత్) లాయర్ గా పనిచేస్తూ ఉంటుంది. రెండో అమ్మాయి కీర్తి (అశ్విని) జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తుంటుంది. ఇక మూడో అమ్మాయి యాషిక (దీపిక) ఒక టీవీ ఛానల్ లో పని చేస్తూ ఉంటుంది. 'చిన్మయి'కి కోపం ఎక్కువ .. ధైర్యం కూడా ఎక్కువే. శివ (కృష్ణ రఘునందన్)తో ఆమెకి బ్రేకప్ అవుతుంది. అందుకు కారణం తెలుసుకోవడం కోసం అతను ఆమె వెంటపడుతూనే ఉంటాడు. అతను శ్రీమంతుల కుటుంబానికి చెందిన షర్మిళ (సోనియా) ఒక్కగానొక్క కొడుకు. ఇక టీవీ సీరియల్స్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న 'టిప్పూ', నటనలో భాగంగా ఎమోషన్స్ ను పలికించలేక పోతుంటాడు. అప్పుడప్పుడు పోలీసులను చూడగానే సుబ్రమణ్యం భయపడిపోతూ ఉంటాడు. భార్య అతనికి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఏడాదికి ఒకసారి వాళ్లు రహస్యంగా ఒక ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. సుబ్రమణ్యం హోటల్ బిల్డింగ్ ను కొనేసిన శివ తల్లి షర్మిళ, ఖాళీ చేయమని వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక తాను నటుడిగా రాణించాలంటే, ముందుగా తన తండ్రి ఎవరనేది తెలుసుకోవాలనే పట్టుదలతో 'టిప్పూ' రంగంలోకి దిగుతాడు. టిప్పూ తండ్రి ఎవరు? ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అతను ఒంటరిగా ఎందుకు పెరగాల్సి వస్తుంది? పోలీసులను చూసి సుబ్రమణ్యం ఎందుకు భయపడుతున్నాడు? ఏడాదికి ఒకసారి ఆ దంపతులు ఎక్కడికి వెళ్లివస్తున్నారు? ఉదయ్ కలెక్టర్ అవుతాడా? చిన్మయి - శివ మధ్య అపార్థాలు తొలగిపోతాయా? అనేది మిగతా కథ. విశ్లేషణ: చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. ఆ కష్టం పిల్లలకి తెలియకుండా చూసుకుంటారు. ఎలాంటి సమస్యలైనా వాళ్లవరకూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ గాయపడిన గతమేదైనా ఉంటే, అది కూడా పిల్లలకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలన్నీ ఉన్న సుబ్రమణ్యం దంపతుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. పిల్లలంతా ఆనందంగా ఉంటే, తల్లిదండ్రులకు అంతకుమించిన సంతోషం ఇంకొకటి ఉండదు. అయితే ఎవరి పనిపై వాళ్లు బయటికి వెళ్లినప్పుడు, ఏ వైపు నుంచి ఎలాంటి సమస్య వచ్చిపడుతుందనేది ఎవరికీ తెలియదు. ఆ వైపు నుంచి దర్శకుడు వేసుకొస్తున్న ట్రాక్ ఆసక్తిని పెంచుతూ వెళుతుంది. రాబోయే కోడలు 'లా' చదివి ఉండకూడదని శివ తల్లి అనుకుంటూ ఉంటే, అతను లాయర్ చిన్మయి వెంటపడుతుండటం మరింత కుతూహలాన్ని పెంచుతుంది. ఒక వైపు నుంచి సుబ్రమణ్యం ధోరణి .. మరో వైపు నుంచి 'టిప్పూ' వైఖరి కూడా ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఒకరి గతంతో ఒకరికి గల సంబంధం ఏమిటనే సందేహం ఈ కథను కదలకుండా ఫాలో అయ్యేలా చేస్తుంది. కొత్త పాత్రలు .. కొత్త మలుపులతో సాగిపోయే ఈ సిరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పనితీరు: సహజత్వంతో కూడిన కథాకథనాలు .. ఆసక్తికరమైన మలుపులు ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు కథను విసరింపజేస్తూ వెళ్లడం, ఆయా పాత్రలు .. వాటిని నడిపించే విధానం కూడా మెప్పిస్తుంది. కుటుంబంలో ఎవరు ఏం చేసినా, అది ఆ కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది. నటీనటుల సంఖ్య ఎక్కువే. అయితే ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది. అందరూ కూడా చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా ప్రధానమైన పాత్రలలో పొన్ వణ్ణన్ - వనిత నటన హైలైట్ గా నిలుస్తుంది. చిన్మయి పాత్రలో ఆయేషా జీనత్ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తాయి. ముగింపు: ఒకప్పటి మాదిరిగా ఇప్పుడు సన్నివేశాలను సాగదీస్తూ కూర్చుంటే ఆడియన్స్ ఓపికతో చూసే పరిస్థితి లేదు. జోనర్ ను .. దానిని ఇష్టపడే ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, చెప్పదల్చుకున్న విషయాన్ని వేగంగా .. బోర్ అనిపించకుండా చెప్పాలి. అలాంటి పద్ధతిని అనుసరించిన సిరీస్ గా ఇది కనిపిస్తుంది. Movie Details Movie Name: Uppu Puli Kaaram Release Date: 2025-11-14 Cast: Ponvannan, Vanitha Krishnachandran,Naveen Muralidhar,Ayesha Zeenath Director: Ramesh Baarathi Music: Sheik Banner: Vikatan Televistas Review By: Peddinti Uppu Puli Kaaram Rating: 2.75 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :