Monday, 08 December 2025 03:37:39 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Sai Durgha Tej : తెర మీద త‌ప్ప జీవితంలో న‌టించ‌లేని సినీ న‌టుల‌ను బ‌లి చేయ‌వ‌ద్దు : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై సాయి దుర్గాతేజ్‌

Date : 03 October 2024 05:13 PM Views : 223

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sai Durgha Tej – Konda Surekha : అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అటు టాలీవుడ్‌లో ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్ప‌టికే టాలీవుడ్ నటీనటులు ఒక్కతాటిపైకి వచ్చి ఈ విషయన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ ఇలాంటి మాట‌లు త‌గ‌వ‌న్నారు. ఇక తాజాగా హీరో సాయి దుర్గాతేజ్ సైతం స్పందించారు. “రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు, నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం, ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడడం, వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు. కానీ ఓ మహిళ ఆత్మాభిమానం, ఓ కుటుంబం పరువు, ప్రతిష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగింది. గౌరవనీయులైన మంత్రివర్యులకు.. రాజకీయ విమర్శలకు, ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన సినీనటులను బలిచేయవద్దని, జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ , భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటున్నా.” అని సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :