Saturday, 24 January 2026 02:22:06 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ghatana Short Film: ఓటీటీలో 'ఘటన' .. అవసరాలు మార్చే అవతారాలు!

Date : 10 December 2025 07:01 PM Views : 105

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : లఘుచిత్రాల వేదికగా 'కథాసుధ' ఈ నెల నుంచి 'ఘటన' స్ట్రీమింగ్ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఆలోచింపజేసే కంటెంట్ 'ఈటీవీ విన్'లో ప్రతివారం 'కథాసుధ' శీర్షిక క్రింద లఘుచిత్రాలను అందిస్తూ వస్తున్నారు. అరగంటలోపు నిడివి కలిగిన ఈ లఘుచిత్రాలు (మైక్రో డ్రామా) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ గా అనిపించే కథాకథనాలతో రూపొందుతున్న ఈ లఘు చిత్రాలు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. అలా ఈ నెల 7వ తేదీన అందుబాటులోకి వచ్చిన కంటెంట్ గా 'ఘటన' కనిపిస్తుంది. రావణ్ రెడ్డి .. గడ్డం శ్రీనివాస్ .. చాందినీరావు నటించగా, కొత్తపల్లి సురేశ్ దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. నాణానికి బొమ్మ - బొరుసు మాదిరిగా, మంచి - చెడు ప్రతి మానిషిలోనూ ఉంటాయి. మనం ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించే తీరును బట్టి, ఎదుటివారు మనతో మసలుకునే విధానం ఉంటుంది. ఎవరినీ కూడా పూర్తి మంచివాడు .. పూర్తిగా చెడ్డవాడు అని చెప్పలేము. పరిస్థితులు .. సందర్భాలు వ్యక్తులను .. వారి స్వభావాలను ప్రభావితం చేస్తూ ఉంటాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన లఘుచిత్రం ఇది. మనకి ఏం తెలుసు? ఎంత తెలుసు? అనే దానికంటే కూడా, మనకి తెలిసిన విషయాన్ని అవతలివారికి అర్ధమయ్యేలా చెప్పగలిగినప్పుడే దాని అసలైన ప్రయోజనం నెరవేరుతుంది. అలా చాలా సింపుల్ కంటెంట్ తీసుకుని అంతే సింపుల్ గా అర్థమయ్యేలా దర్శకుడు ఈ కథను ఆవిష్కరించాడు. మూడే మూడు పాత్రలతో చేసిన ఈ ప్రయత్నం ఆలోచింపజేసేలా ఉంటుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :