Saturday, 17 January 2026 09:29:46 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Bellamkonda Sreenivas: దిగినవాళ్లకే ఇక్కడ లోతు తెలుస్తుంది: బెల్లంకొండ శ్రీనివాస్

Date : 08 September 2025 06:38 PM Views : 254

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఇండస్ట్రీలో స్నేహాలపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్లదేనని, మనవాళ్లు ఎవరూ ఉండరని వ్యాఖ్య మనసులో ఏదీ దాచుకోనని, బాధ కలిగితే నేరుగా చెప్పేస్తానని వెల్లడి సెప్టెంబర్ 12న ‘కిష్కింధపురి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు మంచి కథ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు తప్పక వస్తారని ధీమా టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర పరిశ్రమలోని స్నేహాలు, అంతర్గత సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని, మనవాళ్లు అనుకోవడానికి ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు. తన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, "చిత్ర పరిశ్రమ ఓ సముద్రం లాంటిది. దాని లోతు అందులోకి దిగిన వారికే అర్థమవుతుంది. ఇక్కడ స్నేహితులు ఉండొచ్చు, కానీ బయట ప్రపంచంలో ఉన్నంత స్వచ్ఛమైన బంధాలు ఉండవు. మన ముందు ఒకలా మాట్లాడి, మనం పక్కకు వెళ్లగానే మరోలా ప్రవర్తిస్తుంటారు. అందుకే నేను ఎవరి గురించి గాసిప్స్ వినను, మాట్లాడను" అని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత నైజం గురించి వివరిస్తూ, "నేను చాలా ఓపెన్‌గా ఉంటాను. మనసులో ఏదీ దాచుకోను. ఎవరైనా నన్ను బాధపెడితే, ఆ విషయాన్ని వాళ్ల ముఖం మీదే చెప్పేస్తాను. అదేవిధంగా, నేను తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుంటాను" అని తెలిపారు. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. "మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. మా ‘కిష్కింధపురి’ చిత్రం ఆ నమ్మకాన్ని నిలబెడుతుంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఫోన్ చూసే తీరిక కూడా లేకుండా కథనం ఉత్కంఠగా సాగుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :