Saturday, 24 January 2026 01:54:39 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kangana Ranaut: పార్లమెంటులో కంగనా స్పీచ్ మామూలుగా లేదు!

Date : 10 December 2025 07:03 PM Views : 100

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మోదీ ఈవీఎంలను కాదు, ప్రజల మనసులను హ్యాక్ చేస్తున్నారన్న కంగనా ప్రతిపక్షాల 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు నిరాధారం అని స్పష్టీకరణ ఓటర్ల జాబితా సవరణ అనేది ఒక ప్రక్షాళన ప్రక్రియ అని ఉద్ఘాటన లోక్‌సభలో తనను బెదిరిస్తున్నారని కంగనా ఆవేదన సోనియా పౌరసత్వం లేకుండానే ఓటు వేశారని ఆరోపణ "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హ్యాక్ చేస్తోంది ఈవీఎంలను కాదు... దేశ ప్రజల హృదయాలను" అంటూ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ లోక్‌సభలో వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) ను గట్టిగా సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న 'ఓట్ల దొంగతనం' ఆరోపణలను నిరాధారమైన ప్రచారంగా కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ దేశ భద్రతకు, మహిళల ఆత్మగౌరవానికి ఎంతో కీలకమని ఆమె ఉద్ఘాటించారు. గత ఏడాది కాలంగా పార్లమెంటులో తన అనుభవాలు చాలా బాధ కలిగించాయని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రతిపక్ష సభ్యులు మమ్మల్ని ప్రతిరోజూ బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. మేమిక్కడ నేర్చుకోవడానికి, దేశానికి సేవ చేయడానికి వస్తే, వారు సభను ముందుకు సాగనివ్వడం లేదు" అని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కంగనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రాహుల్ గాంధీ ఏదో పెద్ద రహస్యం బయటపెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విదేశీ మహిళ ఫొటోను 22 సార్లు ఓటర్ ఐడీలో వాడారంటూ పాత ఆరోపణే చేశారు. కానీ ఆ మహిళ అసలు భారత్‌కే రాలేదని స్వయంగా స్పష్టం చేసింది. ఆ మహిళకు ఈ సభ తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను" అని అన్నారు. ప్రతిపక్షాలు తన ఫొటోలను ప్రదర్శించి తనను అవమానించారని, ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని ఆమె మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం 'బేటీ బచావో, బేటీ పఢావో' వంటి పథకాలతో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. పేపర్ బ్యాలెట్ కావాలంటున్న కాంగ్రెస్‌కు కంగనా చరిత్రను గుర్తుచేశారు. "ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్‌నారాయణ్ కేసును గుర్తుచేసుకోవాలి. ఆ కేసులో ఇందిర అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఒక్క రాత్రిలో పదవిని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ కావాలంటున్న వారు ఆ చరిత్రను మరిచిపోయినట్లున్నారు" అని చురకలంటించారు. గాంధీ కుటుంబంపై కంగనా తన దాడిని కొనసాగించారు. "ప్రియాంకా గాంధీజీ, ప్రజలు కొన్నిసార్లు ఇతరుల దయపై ఆధారపడవచ్చు. కానీ ఈ దేశ చట్టాలు రాజకీయ కుటుంబాలను కాపాడటానికి కాదు. సోనియా గాంధీకి పౌరసత్వం లేకుండానే 1983 నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది రికార్డుల్లో ఉంది. ఇదేనా ప్రజాస్వామ్యం?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణను ఒక 'శుద్ధీకరణ ప్రక్రియ'గా అభివర్ణించిన కంగనా, బీహార్ ఉదాహరణను ప్రస్తావించారు. "బీహార్‌లో 60 లక్షలకు పైగా వలసదారులు, అనుమానాస్పద ఓట్లను తొలగించారు. ఆ తర్వాత అక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ప్రక్షాళన దేశవ్యాప్తంగా జరగాలి" అని స్పష్టం చేశారు. చివరగా, 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' విధానాన్ని దేశంలో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :