Sunday, 08 March 2026 04:07:23 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్

నిన్న తార‌క్ అర్ధాంగి ప్ర‌ణ‌తి పుట్టిన‌రోజు “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అంటూ ఇన్‌స్టా వేదిక‌గా తార‌క్‌ పోస్ట్ ఈ పోస్టుకు ప్ర‌ణ‌తితో క‌లిసి ఉన్న‌ రెండు

Date : 26 March 2025 12:21 PM Views : 676

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జూనియ‌ర్ ఎన్‌టీఆర్ మంగళవారం త‌న అర్ధాంగి ప్రణతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ప్ర‌ణ‌తితో క‌లిసి ఉన్న‌ రెండు ఫొటోల‌ను కూడా జోడించారు. ఈ జంట ప్రస్తుతం జపాన్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తార‌క్‌ చివ‌రిగా న‌టించిన 'దేవ‌ర' చిత్రం మార్చి 28న జ‌పాన్‌లో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్ కోసం త‌న స‌తీమ‌ణితో క‌లిసి జపాన్ వెళ్లారు. గ‌త రెండు మూడు రోజులుగా అక్క‌డి వారితో క‌లిసి ఎన్‌టీఆర్‌ తెగ సంద‌డి చేస్తున్నారు. అయితే, ప్ర‌ణ‌తి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంగ‌ళవారం రాత్రి జ‌రిగిన వేడుక‌ల‌కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అంటూ ప్ర‌ణ‌తికి తార‌క్ బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా... ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో స‌తీమ‌ణికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇక త‌ర్వ‌లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ 'ఎన్‌టీఆర్ 31' చిత్రంలో జాయిన్ కానున్నారు. జ‌పాన్ నుంచి వ‌చ్చిన వెంట‌నే తార‌క్‌ ఈ చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. అటు బాలీవుడ్‌లో ఎన్‌టీఆర్‌ ఎంట్రీ ఇస్తున్న‌ 'వార్ 2' చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :