Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నటుడు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ బాగా పాప్యులర్ అయింది. బాలయ్య హోస్టింగ్ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి కాగా, ఇటీవలే నాలుగో సీజన్ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. కొత్త కొత్త సెలబ్రిటీలతో ఈ టాక్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇటీవలే పుష్ప2: ది రూల్ ప్రమోషన్స్‌లో భాగంగా పాన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో బాలకృష్ణతో సందడి చేసిన విషయం తెలిసిందే. తన ఇద్దరు పిల్లలతో కలిసి బన్నీ ఈ టాక్ షోలో కనిపించారు. ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యతో ఈ షోలో పాల్గొననున్నారు. శ్రీలీల అన్‌స్టాపబుల్ తాజా ఎపిసోడ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. స్లీవ్ లెస్ టాప్, చీరకట్టులో క్యారవాన్ ముందు నిల్చున్న ఆమె స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆమె ఎపిసోడ్ తాలూకు ప్రోమో వచ్చే అవకాశం ఉంది. కాగా, భగవంత్ కేసరిలో బాలయ్యతో కలిసి శ్రీలీల నటించారు. ఈ ఇద్దరి కాంబోకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ, శ్రీలీల బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.
Also Read : హోంశాఖ, శాంతిభద్రతలు నా పరిధిలో లేవు: పవన్ కల్యాణ్
Admin
Studio18 News