Wednesday, 17 December 2025 03:50:53 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Devara: మరోసారి వాయిదా పడిన దేవర వేడుక?

Date : 02 October 2024 05:12 PM Views : 218

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం దేవర. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదట్లో కాస్త మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు ఊహించిన విధంగా కంటే చాలా బెటర్‌గా వున్నాయి. దేవర, వర ప్రాతల్లో ఎన్టీఆర్‌ అభినయానికి, ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ అడ్వాంటేజీగా మారాయి. రానున్న వారంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల లేకపోవడం కూడా 'దేవర'కు కలిసొచ్చే అంశం. ఇక విడుదలకు ముందు అన్ని ఏర్పాట్లతో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్‌ వేడుక చివరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరగాల్సిన ఈ వేడుకకు పరిమితికి మించిన ఫ్యాన్స్‌ రావడం, వేదిక వద్ద తోపులాట, ఉద్రిక్త వాతావరణం వుండటంతో తప్పనిసరి పరిస్థితులలో వేడుకను క్యాన్సిల్‌ చేశారు నిర్వాహకులు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలి వచ్చిన ఎన్టీఆర్‌ అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యారు. అయితే ఈ స్థానంలో సినిమా విడుదల తరువాత మరో వేడుకను భారీగా ప్లాన్‌ చేద్డామని అనుకున్నారు మేకర్స్‌. విడుదల తరువాత సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడం, వసూళ్లు కూడా భారీగా వుండటంతో దేవర థ్యాంక్స్‌ మీట్‌ను గుంటూరులోని నంబూరు దగ్గర గ్రౌండ్‌లో అక్టోబర్‌ 3న నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్‌ చేశారని తెలిసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాజాగా థ్యాంక్స్‌ వేడుక కూడా వాయిదా వేశారని సమాచారం. పోలీసుల అనుమతి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది. అయితే ఈ వారంలోనే ఈ వేడుకను జరపాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :