Sunday, 08 March 2026 03:38:58 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Jr NTR: ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌పై తార‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Date : 04 October 2024 11:48 AM Views : 287

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల వ‌చ్చిన‌ 'దేవ‌ర' మూవీ పాజిటివ్ టాక్‌తో మంచి వ‌సూళ్లు రాబ‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా సినిమా స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో తార‌క్ మాట్లాడుతూ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌పై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "బృందావ‌నం చిత్రంతో మా ప్ర‌యాణం మొద‌లైంది. కొర‌టాల ఇప్పుడు నా కుటుంబ స‌భ్యుడిగా మారారు. దేవ‌ర‌-2 మూవీ షూటింగ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా" అని ఎన్టీఆర్‌ అన్నారు. అలాగే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడిన తార‌క్‌.. త‌న‌కు, క‌ల్యాణ్ రామ్‌కు హ‌రికృష్ణ కొస‌రాజు వెన్నెముక‌లాంటి వారు అని అన్నారు. ఆయ‌న వ‌ల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంద‌ని తెలిపారు. ఇక దేవ‌ర‌లో ఎన్టీఆర్‌ స‌ర‌స‌న తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మ‌రో బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించారు. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, మురళీ శర్మ, మలయాళ న‌టుడు షైన్ టామ్ ఛాకో త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :