Sunday, 08 March 2026 03:46:19 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Janhvi Kapoor: యంగ్ హీరో ఇషాన్ గురించి జాన్వీ కపూర్ ఆవేదన

Date : 13 September 2025 07:16 PM Views : 377

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరో ఇషాన్ ఖట్టర్ జాన్వీ కపూర్ ప్రశంసల వర్షం భారతీయ సినిమాలో అత్యంత ప్రతిభావంతుడని కితాబు ఇషాన్‌కు ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదని ఆవేదన బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తన సహనటుడు ఇషాన్ ఖట్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఇషాన్ ఒకడని, కానీ అతడి టాలెంట్‌కు తగ్గ గుర్తింపు ఇంకా రాలేదని ఆమె అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ కలిసి నటించిన 'హోమ్‌బౌండ్‌' చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో జాన్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, జాన్వీ కపూర్ తన సినిమా అనుభవాలను పంచుకున్నారు. "ఇషాన్ ఖట్టర్ అత్యద్భుతమైన నటుడు. కానీ అతనికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు ఇంకా రాలేదు. అయితే, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ప్రపంచం అతడి నటనను ప్రశంసిస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. కష్టపడే వారికి ఎప్పటికైనా విజయం దక్కుతుందని మరోసారి నిరూపితమైంది" అని ఆమె పేర్కొన్నారు. 'హోమ్‌బౌండ్‌' చిత్రాన్ని కేవలం తన కెరీర్ కోసం కాకుండా, కథ నచ్చడం వల్లే ఒప్పుకున్నానని జాన్వీ స్పష్టం చేశారు. "ఈ సినిమా కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే వెంటనే అంగీకరించాను. ఈ సినిమా చేసినందుకు నన్ను ట్రోల్ చేస్తారనే భయం కూడా కలగలేదు" అని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి కేన్స్ ఫెస్టివల్‌లో వచ్చిన స్పందన చూసి తామంతా ఆశ్చర్యపోయామని అన్నారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన 'హోమ్‌బౌండ్‌' చిత్రం ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. ఇందులో జాన్వీ, ఇషాన్‌తో పాటు విశాల్ జెత్వా కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కేన్స్‌లోనే కాకుండా, ఇటీవల జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో కూడా సత్తా చాటింది. అక్కడ ఉత్తమ చిత్రం అవార్డు, అలాగే నీరజ్ ఘైవాన్ కు ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించాయి. ప్రస్తుతం జాన్వీ చేసిన వ్యాఖ్యలతో ఇషాన్ ప్రతిభపై మరోసారి చర్చ మొదలవగా, 'హోమ్‌బౌండ్‌' చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :