Sunday, 15 March 2026 11:20:24 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Kantara Chapter 1: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కాంతార చాప్టర్ 1'... 9 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి..!

Date : 10 October 2025 06:20 PM Views : 340

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాక్సాఫీస్ వద్ద 'కాంతార చాప్టర్ 1' ప్రభంజనం 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన చిత్రం విడుదలైన 9 రోజుల్లోనే రూ. 509 కోట్ల గ్రాస్ వసూళ్లు కొత్త పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్ వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవ‌కాశం కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కాంతార: చాప్టర్ 1' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 509 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, అంచనాలకు మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని, చిత్ర యూనిట్ ఈ భారీ వసూళ్ల వివరాలతో కూడిన ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. 'కాంతార' మొదటి భాగానికి ముందు జరిగిన కథాంశంతో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి ఏమీ లేదు. దీంతో 'కాంతార: చాప్టర్ 1' చిత్రానికి థియేటర్లలో అడ్డే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్లు మరింత పెరిగి, రానున్న రోజుల్లో ఇంకెన్నో కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :